ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2//
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
1. గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావైయ్యా //2//
ప్రతి బలహీన – సమయములో –
నీ బలము నా తోనుండగా భయపడక
ధైర్యముతో నే ముందుకే సాగెద //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
2. ఘోరపాపి అయిన రాహాబున్ –
నీవు ప్రేమించినావుగా వేశ్యగా జీవించినను –
వారసత్వమునిచ్చినావుగా //2//
నా పాపమై – నా శాపమై – మరణించిన
నా యేసయ్య నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//