స్తుతులివిగో నా ప్రభువా
ప్రియమైన నా దేవా
మేలులకై స్తోత్రములు
దీవెనకై కృతజ్ఞతలు
శుద్దుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్
పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరింప లేనిది నీ త్యాగం
నన్ను ప్రేమించే ప్రియనేస్తమా
1.పోరాటముల పరిస్థితులలో
నీ వైపే చూసేదన్
శోధన శ్రమలలో కన్నీటి బాధలలో
నిన్నే కనుగొందును
ఓ దేవా నా దేవా నీవే
నా క్షేమాదారము నీవే
ఓ ప్రేమ నా ప్రేమ నీవే
జీవన మార్గము నీవే (2)
ఏది ఏమైనా కానీ నిన్ను స్తుతియింతును
కష్టమేమైన కానీ నిన్ను విడువను ప్రభు
నీతోనుండుటే జీవితం
నీతోనుండుటే ధన్యము
2.ప్రతిస్థితిగతులను మార్చు వాడ
నీవే ఆశ్రయదుర్గము
దిక్కులేని వారలను ఆదుకొనువాడా
మేలు చేయు దేవుడవు(2)
ఓ రాజా నా రాజా నీవే
నా రక్షణ కేడంబు నీవే
ఓ ప్రభువా నా ప్రభువా నీవే
నా ఆశ్రయదుర్గము నీవే(2)
బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే
యోగ్యతే లేని నన్ను అర్హునిగా చేసితివే
ఎలా నీ రుణం తీర్చెదన్
నా సర్వం నీకే అంకితం