ఎల్ రోయి వై నను చూడగా
నీ దర్శనమే నా బలమాయెను
ఎల్ రోయి వై నీవు నను చేరగా
నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను
అనుపల్లవి: నీ ముఖ కాంతియే నా ధైర్యము
నీ ముఖ కాంతియే నా బలము (2)
1. మరణమే నన్నావరించగా
నీ వాక్యమే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే సిగ్గు నొందెను (2). ||నీ ముఖ||
2. విశ్వాసమే శోధింపబడగా
నీ కృపయే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా
శత్రు ప్రణాళిక ఆగిపోయెను (2) ||నీ ముఖ||
3. ఒంటరినై నేను నిను చేరగా
నా పక్షమై నీవు నిలచితివే
ఎల్ రోయి వై నను చూడగా
శత్రువే పారిపోయెను (4) ||నీ ముఖ||