తల్లి వడిలో పవలించే బిడ్డ వలేనే తండ్రీ
నీ ఒడిలో నే ఒదిగితినయ్యా (2)
1) వేదన లేదు శోధన లేదు
నీ హస్తం విడువనయా
భయమన్నది లేనే లేదు నీవు ప్రేమ తో నడిపితివి (2) “తల్లి “
2) నీ ఉపకారం స్మరియించి
స్తుతి స్థోత్రము తెలిపెదను
నే స్తుతి స్తోత్రము తెలిపెదను
చెయ్యి విడువని నా యేసయ్య కల్వరి నాయకుడా
నా కల్వరి నాయకుడా ” తల్లి ”
3) మంచి కాపరి జీవ కాపరి
మంచి కాపరి నా జీవ కాపరి
హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితి వా ఆత్మతో
కలిపితివా నా ఆత్మతో కలిసితి వా ” తల్లి “
4) నిన్ను నేను పట్టుకొంటిని
భుజముపైన సోలెదను నీ భుజము పై సోలెదను
నీ రెక్కల నీడలో నుండి ఈ లోకాన్ని మరచితిని. ” తల్లి “