Join Our Service





    Edit Template

    మహోన్నతుడా మా దేవా

    మహోన్నతుడా మా దేవా
    సహాయకుడా యెహోవా (2)
    ఉదయ కాలపు నైవేద్యము
    హృదయపూర్వక అర్పణము (2)
    మా స్తుతి నీకేనయ్యా
    ఆరాధింతునయ్యా (2)          ||మహోన్నతుడా||

    అగ్నిని పోలిన నేత్రములు
    అపరంజి వంటి పాదములు (2)
    అసమానమైన తేజో మహిమ
    కలిగిన ఆ ప్రభువా (2)          ||మా స్తుతి||

    జలముల ధ్వని వంటి కంట స్వరం
    నోటను రెండంచుల ఖడ్గం (2)
    ఏడు నక్షత్రముల ఏడాత్మలను
    కలిగిన ఆ ప్రభువా (2)          ||మా స్తుతి||

    ఆదియు అంతము లేనివాడా
    యుగయుగములు జీవించువాడా (2)
    పాతాళ లోకపు తాళపు చెవులు
    కలిగిన ఆ ప్రభువా (2)          ||మా స్తుతి||

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Transforming Lives since 1978

    Get Involved

    About Us

    Service Times

    7:30 AM - Kannada

    9:00 AM - English

    10:30 AM - Telugu

    10:30 AM - Hindi

    6:00 PM - Evening

    Contact Info

    © 2024 Created with Priyesh Infotech

    Views: 103539