పాపిగా నను చూడలేక
పాపముగా మారినావా
దోషిగా నను చూడలేక
నా శిక్ష నీవు పొందినావ (2)
నా తల ఎత్తుటకు
నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు
అవమానమొందితివే
తండ్రితో నను చేర్చుటకు
విడనాడబడితివే
జీవం నాకిచ్చుటకు
మరణమొందితివే
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్య (2)
నా భాలమంతా నీవే
నా సౌందర్యం నీవే
నా ఐశ్వర్యం నీవే
నీవే నీవే
నా అతిశయము నీవే
నా ఆనందము నీవే
నా ఆధారం నీవే
నీవే నీవే (2)
యేసయ్య (5)
నా యేసయ్య…