Join Our Service





    Edit Template

    దేవ సంస్తుతి చేయవే మనసా

    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
    పావన నామము నుతించుమా – నా యంతరంగము
    లో వసించు నో సమస్తమా          ||దేవ||

    జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
    నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
    లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే          ||దేవ||

    చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
    జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
    జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే          ||దేవ||

    యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
    యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
    భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే          ||దేవ||

    ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
    విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
    విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే          ||దేవ||

    అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
    నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
    నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే          ||దేవ||

    పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
    భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
    ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే          ||దేవ||

    పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2)
    ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
    ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే          ||దేవ||

    కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)
    యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
    యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే          ||దేవ||

    మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)
    మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
    కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే          ||దేవ||

    పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2)
    వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
    ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే          ||దేవ||

    పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
    తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే          ||దేవ||

    Deva Samsthuthi Cheyave Manasaa
    Sree-manthudagu Yehova Samsthuthi Cheyave Manasaa
    Deva Samsthuthi Cheyumaa Naa – Jeevama Yehovaa Devuni
    Paavana Namaamu Nuthinchumaa – Naa Yantharangamu
    lo Vasinchu No Samasthamaa             ||Deva||

    Jeevamaa, Yehovaa Neeku – Jesina Mellan Maruvaku (2)
    Neevu Chesina Paathakambulanu – Manninchi Jabbu
    Leviyun Lekunda Jeyunu – Aa Kaaranamuche            ||Deva||

    Chaavu Gothinundi Ninnu – Levanetthi Dayanu Grupanu (2)
    Jeeva Kireetamuga Veyunu – Nee Shirasu Meeda
    Jeeva Kireetamuga Veyunu – Aa Kaaranamuche            ||Deva||

    Yavanambu Pakshiraaju – Yavanambu Valene Krottha (2)
    Yavanambai Velayunatlugaa – Me Lichchi Needu
    Bhaavamunu Santhushtiparachunugaa – Aa Kaaranamuche            ||Deva||

    Prabhuvu Neethi Panulu Cheyun – Baadhithulaku Nyaaya Michchun (2)
    Vibhundu Maargamu Thelipe Mosheku – Dana Kaaryamulanu
    Vippe Nishraayelu Janamunaku – Aa Kaaranamuche            ||Deva||

    Athyadhika Prema Swaroopi-Yaina Deergha Shaanthaparundu (2)
    Nithyamu Vyaajyambu Cheyadu – Aa Kruponnathudu
    Nee Payi Nepudu Kopa Munchadu – Aa Kaaranamuche            ||Deva||

    Paamarula Mani Prathyupakaara – Prathi Phalambul Pampaledu (2)
    Bhoomi Kanna Naakasambunna – Yetthundu Daiva
    Prema Bhakthi Janulayanduna – Aa Kaaranamuche            ||Deva||

    Padamatiki Thoorpentha Yedamo – Paapamulakunu Manaku Nanatha (2)
    Yedamu Kalugajesiyunnaadu – Mana Paapamulanu
    Edamugaane Chesiyunnaadu – Aa Kaaranamuche            ||Deva||

    Kodukulapai Thandri Jaali – Padu Vidhamugaa Bhakthiparula (2)
    Yedala Jaali Padunu Devundu – Thana Bhakthiparula
    Yedala Jaalipadunu Devundu – Aa Kaaranamuche            ||Deva||

    Manamu Nirmithamayina Reethi – Thanaku Delisiyunna Sangathi (2)
    Manamu Manti Vaaramanchunu – Gnaapakamu Chesi
    Konuchu Karuna Joopuchundunu – Aa Kaaranamuche            ||Deva||

    Poosi Gaali Veeva Negiri – Poyi Basanu Deliyani Vana (2)
    Vaasa Pushpamu Valene Narudundu – Naru Naayuvu Thruna
    Praayamu Mana Deva Krupa Mendu – Aa Kaaranamuche            ||Deva||

    Parama Deva Nibandha Naagnal – Bhakthitho Gaikonu Janulaku (2)
    Nirathamunu Grupa Nilichi Yundunu – Yehova Neethi
    Tharamulu Pillalaku Nundunu – Aa Kaaranamuche            ||Deva||

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Transforming Lives since 1978

    Get Involved

    About Us

    Service Times

    7:30 AM - Kannada

    9:00 AM - English

    10:30 AM - Telugu

    10:30 AM - Hindi

    6:00 PM - Evening

    Contact Info

    © 2024 Created with Priyesh Infotech

    Views: 102388