జై జై.. జై జై.. జై జై.. జై జై..
జై జై.. జై జై.. జై జై.. జై జై..
యేసు రాజుకే – జై జై జై జై
విజయశీలుడకే – జై జై జై జై
మృత్యుంజయుడికే – జై జై జై జై
రానున్నరారాజుకే – జై జై జై జై
చరణం :- 1
జాలికలిగిన దేవుడోయ్ దేవుడు
ప్రేమ కలిగిన దేవుడోయ్ దేవుడు
కనుపాపగా కాచే దేవుడోయ్ దేవుడు
మాటయిచ్చి నెరవేర్చే దేవుడోయ్ దేవుడు
కృప ద్వారా రక్షించి రక్తాన్ని చిందించి
తన ప్రేమను కనపరచిరి మరణమును ఓడించి
జీవముతో జయించి మార్గమును కనపరచిరి…. (2)
(జై జై జై జై)
చరణం :- 2
మేలులను చేసే దేవుడోయ్ దేవుడు
స్వస్థపరచే దేవుడోయ్ దేవుడు
శక్తినిచ్చే దేవుడోయ్ దేవుడు
విరిగినవారిని బాగుచేసే దేవుడు
విశ్వాసము నీకు ఉంటె అసాధ్యమే లేదు
వాగ్దానము నీ సొంతమే యేసునామము ధరించి
ప్రార్ధనలో జీవించి సమాధానముతో సాగించు…
(జై జై జై జై)