ఎల్రోయివై నను చూడగా నీ దర్శనమే నా బలమాయెను
ఎల్రోయివై నీవు నను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను
నీ ముఖకాంతియే నా ధైర్యము
నీ ముఖకాంతియే నా బలము (2)
1. మరణమే నన్నావరించిగ నీ వాక్యమే నాతో నిలిచేను
ఎల్రోయివై నను చూడగ.. శత్రువే సిగ్గు నొందేను
నీ ముఖకాంతియే నా ధైర్యము
నీ ముఖకాంతియే నా బలము (2)
2. విశ్వాసమే శోధించబడగ…నీ కృపయే నాతో నిలిచేను
ఎల్రోయివై నను చూడగ..శత్రు ప్రణాళిక ఆగిపోయెను
3.ఒంటరినై నేను నిను చేరగా…నా పక్షమయి నీవు నిలిచితివే
ఎల్రోయివై నను చూడగ… శత్రువే పారిపోయెను…