పల్లవి: ఆ జాలి ప్రేమను – గమనింపకుందువా
ఆ దివ్వ ప్రేమను – గ్రహియింపకుందువా
ఓ సోదరా, ఓ సోదరి – ఆప్రేమమూర్తి యేసు దరిచేరవా!

౧. నీ పాప జీవితాన – ఆ ప్రేమ మూర్తియే
ఆ సిల్వపైన నీకై – మరణ బాధ నొందెను
నీ శిక్ష బాపగా – రక్షణను చూపగా
నీ హృదయ ద్వార మందు – వేచియుండెగా
నీ రక్షకుండు యేసు – నిన్ను పిలుచుచుండెను
ఆ ప్రేమమూర్తి పలుకు – నాలకింపజాలవా
||ఓ సోదరా||

౨.ఎంత పాపినైనగాని – యేసు చేర రమ్మనే
యేసు చెంత చేరువాని – త్రోసివేయజాలడు
నీ పాప జీవితం – ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను – పిలుచు చుండెగా
విలువైన రక్తధార – ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమమూర్తి పిలుపు – నాలకింపజాలవా
||ఓ సోదరా||