పల్లవి: ఆరాధనా నా యేసుకే – నిత్యము నే చేసెదను
నా ఆత్మతో ఆరాధించి స్తుతులను నే చెల్లింతును
ఆరాధనా ఆరాధనా ఆరాధనా….ఆమేన్   ||ఆరాధనా||

౧. అద్బుతకరుడా నీకే స్తోత్రం – ఆదిసంభూతుడ నీకే స్తోత్రం
రక్షణకర్తా నీకే స్తోత్రం – త్వరలో రానున్న రాజాధి రాజగు  ||నా యేసుకే ఆరాధనా||

౨. ఎండిన ఆత్మకు విడుదలనిచ్చి – వాక్యపు వెలుగులో నను నడిపించి
చేసిన విఙాపనను ఆలకించి – విశ్వాసయాత్రలో నను బలపరిచి  ||నా యేసుకే ఆరాధనా||

నా గానం ధ్యానం నీవయ్యుండగా – నా ప్రాణం జీవం నీవే ప్రభు
స్తుతులకు అర్హుడ స్తోత్రార్హుడ – ఆదియు అంతము నీవే ప్రభు   ||నా యేసుకే ఆరాధనా||