ఆనంద యాత్ర… ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతనా యెరుషలేము యాత్ర      ||ఆనంద||

౧. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును
వేయినోళ్ళతో స్తుతియించినాను తీర్చలేము ఆ ఋణమునూ  ||ఆనంద||

౨. రాత్రియూ పగలునూ పాదములకు రాయి తగులాకుండా
మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా   ||ఆనంద||

౩. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం   ||ఆనంద||